- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: బతుకమ్మకుంట ప్రారంభం.. జాతికి అంకితం చేసిన CM రేవంత్
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ బతుకమ్మకుంట(Bathukamma Kunta) పూర్వవైభవం సంతరించుకుంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ బతుకమ్మకుంట(Bathukamma Kunta) పూర్వవైభవం సంతరించుకుంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. చెరువులో బతుకమ్మలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఎన్నో ఏళ్లుగా అక్రమార్కుల చెరలో ఉన్న బతుకమ్మకుంటను ఇటీవల హైడ్రా అధికారులు పునరుద్ధరించారు. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ఐదెకరాల విస్తీర్ణంలో ఈ కుంటను సుందరంగా తీర్చిదిద్దారు. చిన్న పిల్లలు ఆడేందుకు ఆటస్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచీలు తదితరాలు ఏర్పాటు చేసింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ కట్టింది. ప్రస్తుత వర్షాలకు కుంటలో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. మహిళలు ఇకపై ఏటా బతుకమ్మ వేడుకలను ఇక్కడే జరుపుకొనే అవకాశం ఉండటంతో.. ఇది సాంస్కృతిక కేంద్రంగా అవతరించనుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మకుంటను ప్రారభించి ప్రజలకు అంకితం చేశారు.






