CM Revanth Reddy: 39 ఎస్టీపీలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటించారు.

CM Revanth Reddy: 39 ఎస్టీపీలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ 6 సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ (మురుగునీటి శుద్ధి కర్మాగారం) ప్రారంభించిన ఆయన, అమృత్ 2.0 పథకం కింద ఔటర్ లో మరో 39 ఎస్టీపీ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. ఇవాళ ప్రారంభించిన ఆరు ఎస్టీపీలను 332 ఎంఎల్‍డీల సామర్థ్యంతో జలమండలి నిర్మించింది. రూ. 319.43 కోట్లతో 212 ఎంఎల్‍డీ సామర్థ్యంతో అంబర్ పేట ఎస్టీపీ నిర్మించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని శుద్ధి చేసేలా ప్రభుత్వం ఈ ఎస్టీపీలను నిర్మిస్తోంది. ఈ సందర్భంగా ఎస్టీపీల పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 45 ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం డీపీఆర్ లు రూపొందించగా వీటిలో ఇప్పటికే పూర్తయిన ఆరు ఎస్టీపీలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రారంభించారు.

Next Story