- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth : మరోసారి ఫుట్‌బాల్ ఆడి ఆకట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన 74వ ‘ఆల్ ఇండియా పోలీసు ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్’ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన 74వ ‘ఆల్ ఇండియా పోలీసు ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్’ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులతో కలిసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడిన సీఎం, గోల్ కొట్టి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
టోర్నీకి ప్రముఖ స్పై పేరు..
బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు, క్రికెటర్ సిరాజ్‌కు రూ.కోటితో పాటు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించినట్లు గుర్తుచేశారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా క్రీడల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడిలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారని అభినందించారు. దేశవ్యాప్తంగా 34 పోలీస్ విభాగాలు పాల్గొన్న ఈ టోర్నీకి ప్రముఖ స్పై బీఎన్ మల్లిక్ పేరు పెట్టడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్ అంటే ఎంతో మక్కువ. గతంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ఆడి తన క్రీడాభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.






