CM Revanth Reddy: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

by Kema Shiva Kumar |

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఇవాళ లాంఛనంగా ప్రారంభించింది.

CM Revanth Reddy: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఇవాళ లాంఛనంగా ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ (Mobile Application)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ పథకం భాగంగా లబ్ధిదారుల వివరాలను అధికారులు యాప్‌‌ ద్వారా సేకరించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాలను ఎంపిక చేశారు.

అయితే, తొలి విడతలో భాగంగా సొంత స్థలం (Own Land), రేషన్‌ కార్డు (Ration Card) ఉన్న వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి, ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లగా తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు మంజూరు కానున్నాయి. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో (Manifesto)లో ఉన్న విధంగా ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.5 లక్షల అర్థిక సాయం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసి, ఆ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి, రైతు భరోసా, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అందులో దాదాపు 30 నుంచి 40 లక్షల మంది అర్హులు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

Next Story