- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: ఆర్ఎస్పీ బానిస మనస్తత్వం అందరికీ తెలుసు.. తనపై కేసు పెట్టడంపై సీఎం హాట్ కామెంట్స్
ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని సీఎంపై కేసు నమోదు చేసి విచారించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS.Praveen Kumar) నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ ఫిర్యాదు చేసిన వ్యక్తి బానిస మనస్తత్వం, ఆలోచన విధానం అందరికీ తెలుసన్నారు. ఏదో ఒక రోజు ఆ బానిస సంకెళ్ల నుంచి తెంచ్చుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఏడాది క్రితం ఆయన ఏం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఎవరి కోసం తాపత్రాయపడుతున్నారు అందరం చూస్తున్నామన్నారు. ఈ ఫిర్యాదు ద్వారా అసలు విషయం పక్కదారి పట్టించాలని అనుకుంటే అది వారి భ్రమ అన్నారు.
వాళ్లకు మాకు అదే తేడా:
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో వారు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి లండన్ లో పెట్టుబడులు పెడితే మేము ప్రజల కోసం విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకు వచ్చామని సీఎం చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రజల సొమ్మును కొల్లగొట్టారని వారిపై కేసులు పెట్టారు. ప్రజల కోసం పెట్టుబడులు తెచ్చినందుకు ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారని చెప్పారు. మేము దావోస్ కు వెళ్లింది పెట్టుబడులు తీసుకురావడానికి. వాళ్లకు మాకు ఉన్న తేడా ఇదేనన్నారు. సంస్థలు ఎక్కడివైనా వారి దగ్గర ఉన్న డబ్బులను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతిమంగా రాష్ట్రంలో పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనేది మా ఉద్దేశం అన్నారు.
వారి కడుపు మంట అది:
ఇక్కడి సంస్థలను విదేశాలకు తీసుకువెళ్లి పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి, కేటీఆర్ (KTR) చేసిన విమర్శలపై స్పందించిన సీఎం.. మహారాష్ట్రకు చెందిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ లో ఒప్పందం చేసుకున్నారు. దీనికి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. వారి కడుపు మంట అంతా మేము దావోస్ వెళ్లి విఫలం అవుతే దానిపై పైశాచిక ఆనందం పొందాలనుకుంటే అది కుదరలేదు. మేము విజయంతంగా పెట్టుబడులు ఆకర్షించగలిగాం. దాంతో ఈ రకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి దావోస్ కు వచ్చారు. పెట్టుబడిదారులు అన్ని అంశాలను బేరీజు వేసుకునే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఒకాయన నేతలు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో బాధపడుతుంటే ఇంకొకాయన ఆయనకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.






