హరీష్‌రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు : సీఎం రేవంత్

by Naga Rani Yarlagadda |

మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

హరీష్‌రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు : సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు అప్పులు చేయడం గురించి మాత్రమే మాట్లాడారని, తీరుస్తున్న అప్పుల గురించి చెప్పడం లేదన్నారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.70 వేల కోట్ల అప్పులు చేస్తే.. రూ.95 వేలకోట్ల అప్పుల్ని తీరుస్తున్నామని, ఈ విషయాన్ని హరీష్ రావు గ్రహించాలన్నారు. ప్రభుత్వానికి FRBM పరిధి దాటి అప్పులు చేసే వీలు లేదన్నారు. హరీష్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసని, కానీ ఆ వివరాలేవీ తాను బయటికి చెప్పనని సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో వైఎస్సార్ దగ్గరకు కూడా హరీష్ రావు వెళ్లారన్నారు. పార్టీ మీటింగ్ ను వదిలేసి.. ఆయన అర్జంటుగా ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు.

త్వరలోనే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, ఇందులో సందేహమే లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీబీఐకి.. ప్రాథమిక ఆధారాలతో రెండు కేసులిచ్చినా ఇంకా దర్యాప్తు ఎందుకు చేయడం లేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక వచ్చే ఎన్నికలపై మాట్లాడుతూ.. మరోసారి కాంగ్రెస్ పార్టీదే విజయమని.. గెలుపు ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు, తనది విజయవంతమైన కాంబినేషన్ అని, తమ నేతృత్వంలో అన్ని ఎన్నికలను గెలిచామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మహేశ్ కుమార్ గౌడ్ కు మంచి పదవి వస్తుందని రేవంత్ మనసులో మాట చెప్పారు. ఇక 2034 వరకూ తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని మరోసారి స్పష్టం చేశారు.

Next Story