- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించండి.. CM రేవంత్ ఆదేశం
తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పురాతన ఇళ్లలో ఉన్నవారిని తక్షణమే గుర్తించి ఖాళీ చేయించాలని ఆదేశించారు. కాజ్‌వేలు, కల్వర్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) వ్యాప్తంగా వర్షం(Heavy Rain) దంచికొట్టింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Next Story






