క్యాన్స‌ర్ బాధిత కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

క్యాన్స‌ర్ బాధిత కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండ‌గా నిలిచారు. సిరిసిల్ల‌కు చెందిన సాయిచ‌ర‌ణ్ అనే వ్య‌క్తి క్యాన్స‌ర్‌తో బాధపడుతున్నారు.

క్యాన్స‌ర్ బాధిత కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: క్యాన్స‌ర్ బాధిత కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండ‌గా నిలిచారు. సిరిసిల్ల‌కు చెందిన సాయిచ‌ర‌ణ్ అనే వ్య‌క్తి క్యాన్స‌ర్‌తో బాధపడుతున్నారు. తన చికిత్స కోసం ఇల్లు అమ్మినా కూడా డబ్బులు సరిపోకపోవడంతో సాయిచరణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు. కాగా గతంలో సాయి చరణ్ చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5 లక్షలు అందజేయగా తాజాగా సీఎం ఆర్ఎఫ్ ద్వారా రేవంత్ రెడ్డి స్వయంగా మరో రూ.7 లక్షలను అందజేశారు. దీంతో సాయి చరణ్ కుటుంబ సభ్యులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బాధితులను నేరుగా కలిసి వారికి సీఎం సాయం చేయడంతో చాలా మంది ఆయనను ప్రశంసిస్తున్నారు.

Next Story