CM Revanth Reddy: మామూనూరు విమానాశ్రయం పనులు మొదలు పెట్టండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

by Prasad Jukanti |   (  Updated:2026-02-15 09:33:43  IST  )

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

CM Revanth Reddy: మామూనూరు విమానాశ్రయం పనులు మొదలు పెట్టండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి
X

దిశ, తెలగాణ బ్యూరో డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్కడ వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి రాజ్‍నాథ్‍సింగ్‍తో భేటీ అయిన సీఎం ఆ తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు‍తో (Ram Mohan Naidu) భేటీ అయ్యారు. మామూనూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి అయినందున అవసరమైన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని, అంతర్గాం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రికి తెలియజేశారు.

అశ్వినీ వైష్ణవ్ తో భేటీ:

అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో (Ashwini Vaishnaw) భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై మంత్రితో సీఎం చర్చించారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం వారికిఅందజేశారు.

Next Story