TG: స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన CM రేవంత్

by Gantepaka Srikanth |

పీసీసీ(PCC) కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా నూతన పీసీసీ కార్యవర్గానికి అభినందనలు చెప్పారు.

TG: స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: పీసీసీ(PCC) కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా నూతన పీసీసీ కార్యవర్గానికి అభినందనలు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. కార్యకర్త స్థాయి నుంచి అనేకమంది ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారని గుర్తుచేశారు. ‘పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే పదవులు అవే వెతుక్కుంటూ వచ్చి తీరుతాయి. నాకు కాంగ్రెస్ పార్టీ భాద్యతలతోనే ముఖ్యమంత్రి పదవి దక్కింది. నాతో పాటు పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చాం. పార్టీ పదవులు వచ్చాయని పనిచేయకపోతే వారిని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారు. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అతి త్వరలో కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

అంతేకాదు.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావలసిన బాధ్యత కూడా కార్యకర్తలదే అని గుర్తుచేశారు. పార్టీ నిర్మాణంలో మీరు బాధ్యత తీసుకోవాని సూచించారు. అధికారం వచ్చిన సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. 18 నెలల్లో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాం.. దేశంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత ఖర్చు చేయలేదు.. విద్యార్థులకు 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు, 40 శాతం డైట్ చార్జీలు పెంచాం.. 100 ఏళ్ల కులగణన కలను నెరవేర్చాం.. ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించాం.. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలి. పార్టీ పదవి అని చిన్న చూపు చూడొద్దు.. రేపు గొప్ప అవకాశాలు ఇచ్చేది పార్టీ పదవులే.. 2029లో పార్టీ 2వ సారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయి.. పార్టీ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలి.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా కాంగ్రెస్ నాయకులు ఉండాలని ఆదేశించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, 18 నెలల కాంగ్రెస్ పాలనపైన బహిరంగ చర్చకు సవాల్ చేశారు.

Next Story