- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి జరగాలి.. వాటి జోలికి వెళ్లొద్దు: CM రేవంత్ కీలక ఆదేశాలు
మేడారం సమ్మక్క - సారలమ్మ(Sammakka - Saralamma) ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వయంగా పరిశీలించారు.

దిశ, వెబ్‌డెస్క్: మేడారం సమ్మక్క - సారలమ్మ(Sammakka - Saralamma) ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వయంగా పరిశీలించారు. మంగళవారం ఉదయం ములుగు జిల్లా మేడారం(Medaram) చేరుకున్న ఆయన మంత్రులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రాంగణ ప్రాంతాన్నంతా తిరిగి పరిశీలించారు. ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణానికి సంబంధించి చేపట్టే అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలో చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ కార్యక్రమాలు జరగాలని.. ఎట్టి పరిస్థితుల్లో చెట్లను తొలగించొద్దు అని.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా పూజారులు, ఆదివాసీ పెద్దలతో సంప్రదిస్తూ పనులు కొనసాగించాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






