- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రానీయొద్దు.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
పురపాలక శాఖ(Municipal Department)పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: పురపాలక శాఖ(Municipal Department)పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు తేవాలి అని చెప్పారు. పాతికేళ్ల అవసరాల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భూగర్భ డ్రైనేజ్, విద్యుత్ కేబులింగ్‌కు చర్యలు తీసుకోవాలి అని అన్నారు. కోర్‌అర్బన్ రీజియన్‌లో కాలుష్య నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలోని సమస్యలు అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలని అన్నారు. మౌళిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.






