- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6 నెలల్లో మళ్లీ KCR సీఎం.. ప్రజలు ఘోరీ కడతారని BRS నేతలకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరు నెలల్లో మళ్లీ సీఎం అవుతారంటూ ఇటీవల బీఆర్ఎస్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరు నెలల్లో మళ్లీ సీఎం అవుతారంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచన చేసిన వారికి తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని.. ఐదేళ్ల సుస్థిర పాలన అందించే బాధ్యత మాదని చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతల మాటల్లో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని విమర్శించారు.
Read More..
నిరుద్యోగులకు శుభవార్త.. రేపే కొత్త పోస్టులతో రీ నోటిఫికేషన్






