- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండారెడ్డిపల్లి సర్పంచ్‌గా సీఎం చెడ్డీ దోస్త్ ఏకగ్రీవం
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్ మేట్ వెంకటయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15మంది పోటీ పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్ మేట్ వెంకటయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15మంది పోటీ పడ్డారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు అంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. పదివిని ఆశిస్తున్న 15మందిలో ఒకరి పేరును సీల్డ్ కవర్‌లో పెట్టి ప్రకటించారు.
దీంతో సీఎం స్వగ్రామానికి కాబోయే సర్పంచ్ ఎవరవుతారు అనే సస్పెన్స్ వీడింది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైన తరవాత కొండారెడ్డిపల్లి తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం సీఎం బాటలు వేస్తున్నారు. జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిసారి సీఎం తమ స్వగ్రామంలోనూ పర్యటిస్తుంటారు. ఇక ఇప్పుడు తన మిత్రుడే సర్పంచ్‌గా ఎన్నికవ్వడంతో గ్రామాభివృద్ధి డబుల్ స్పీడులో జరిగే అవకాశం ఉంది.






