CM Revanth Reddy: గల్లీలో లొల్లి చేస్తున్నవారు ఢిల్లీలో ఎందుకు భయపడుతున్నారు?.. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ మోడీ భజనలో బిజీగా ఉన్నారని సీఎం విమర్శించారు.

CM Revanth Reddy: గల్లీలో లొల్లి చేస్తున్నవారు ఢిల్లీలో ఎందుకు భయపడుతున్నారు?.. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని తాము పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) మోడీ భజనలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. మన రైతుల కోసం మోడీ సర్కారు పై ఒత్తిడి తెచ్చేందుకు మాతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పత్తా లేరని గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు ఢిల్లీలో మోడీని (Modi) ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు? మోడీ అంటే భయమా! భక్తా?అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని ఇవాళ పార్లమెంట్ ఆవరణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికాగా స్పందించిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ప్రియాంక గాంధీకి ధన్యావాదాలు తెలిపారు.

Next Story