రాఖీపండుగ శుభాకాంక్షలు తెలిపిన CM రేవంత్.. మహిళలకు కీలక భరోసా

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాఖీ పండుగ(Rakhi Festival) శుభాకాంక్షలు చెప్పారు.

రాఖీపండుగ శుభాకాంక్షలు తెలిపిన CM రేవంత్.. మహిళలకు కీలక భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాఖీ పండుగ(Rakhi Festival) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళా సాధికారత కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పథకాల్లో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షాబంధన్ అని పేర్కొన్నారు. కాగా, సోదర బంధానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారు. శ్రావణ పూర్ణిమ రోజున దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి, అతని దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని ప్రమాణం చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కూడా రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

Next Story