- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Children's Day: మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టాం: CM రేవంత్
చదువుతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని.. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: చదువుతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని.. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూను స్మరించుకున్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని సూచించారు. బాలలను జాతి సంపదగా భావించి వారి మెరుగైన భవితవ్యానికి కృషి చేయాలన్న నెహ్రూ ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులన్న నెహ్రూ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.






