- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింహాచలం ప్రమాద ఘటన.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం
సింహాచలం ప్రమాద ఘటపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: సింహాచలం ప్రమాద ఘటపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్.. ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలం ఆలయం (Simhachalam Temple) వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందని అన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి (Deep Condolences)ని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చారు.
కాగా సింహచలం అప్పన్న స్వామి సన్నిథిలో చందనోత్సవంలో ఘోర ప్రమాదం (Huge Accident) చోటు చేసుకుంది. అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి రూ.300 టికెట్ క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న 20 అడుగుల సిమెంట్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. అంతేగాక పలువురికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, అధికారుల పర్యవేక్షణలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై పలువురు స్పందిస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.






