- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: ఇకపై అద్దె భవనాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదు
ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు శనివారం సచివాలయంలో శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. యావత్ తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక కేర్, ప్యూర్, రేర్‌కు అనుగుణంగా అన్నీ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఎంత మాత్రం అద్దె భవనాలలో ఉండకూడదని అన్నారు.
కేంద్ర ప్రయోజిత పథకాలపై దృష్టి పెట్టాలి. ఫైళ్ల క్లియరెన్స్ నిర్ధిష్ట సమయంలో జరగాలి. వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, పెట్టుబడులు గ్రౌండ్ కావాలి. సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను వినియోగించుకోవాలి. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో రాబోయే మార్పులు, తద్వారా నగర ప్రజలకు జరిగే మేళ్లపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించబోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత మెరుగుపడాలి. ప్రాంతాల వారిగా మెడికల్ డేటాను తయారు చేయాలి. మార్చి 6 నుండి 99 రోజుల ప్రణాళిక అమలు కార్యచరణ తీసుకోవాలి. జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జూన్ 2 తెలంగాణ పండుగ ఘనంగా జరుపుకోవాలి. ప్రతి ఎన్నికలో ప్రజలు మాకు బలం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి ప్రజలకు మరింత సేవ చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. దీనికి అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.






