- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Tour: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ఎందుకంటే?
by Ramesh Naini |
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలను వారు కలిసే అవకాశం ఉంది.
Next Story






