- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్మోహన్ సింగ్ వర్ధంతి.. నివాళులు అర్పించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక వేత్త స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇవాళ జూబ్లీ హిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక వేత్త స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇవాళ జూబ్లీ హిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడిగా, నవ భారత శిల్పిగా దేశానికి అపార సేవలు అందించారని పేర్కొన్నారు. నిజాయితీ, దూరదృష్టి, మానవతావాదంతో దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో చేపట్టిన సంస్కరణలు దేశ ప్రగతికి బలమైన పునాది వేశాయని తెలిపారు. డా. మన్మోహన్ సింగ్ ఆలోచనలు, విధానాలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.






