- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సడెన్ టూర్ వెనుక రీజన్ ఇదే!
by Prasad Jukanti |
నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరగబోయే ఇన్వెస్టర్స్ సమావేశంలో పాల్గొనందుకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఢిల్లీ టూర్ లో (Delhi Tour) భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతోనూ రేవంత్ రెడ్డి కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ముంచుకొస్తున్న కోర్టు విధించిన గడువు, బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ నిర్ణయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్టీలో పదవులపై చర్చించే చాన్స్ ఉంది.
Next Story






