CM Revanth Reddy : సివిల్స్ సర్వీసెస్ సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

by Muthe.Rajitha |

మంగళవారం సివిల్స్ సర్వీసెస్ పరీక్ష 2024(CSE 2024) తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

CM Revanth Reddy : సివిల్స్ సర్వీసెస్ సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళవారం సివిల్స్ సర్వీసెస్ పరీక్ష 2024(CSE 2024) తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం(Rajiv Gandhi Civil Abhayahastam Scheme) ద్వారా ఆర్థిక సహాయం పొందినవారిలో ఏడుగురు అభ్యర్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు రాణించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే ఏడుగురు అభ్యర్థులు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసులకు ఎంపిక కావడం మన రాష్ట్రానికి గర్వకారణమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులు అందరినీ హృదయపూర్వకంగా అభినందించారు.

వారంతా దేశసేవలో, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. యువత తమ కలలు, ఆశయాలను నిజం చేసుకునే విధంగా వారికి మద్దతు ఇవ్వడంలో, సాధికారత కల్పించడంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు. కాగా తెలంగాణలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆర్థిక సహాయం పొంది, ఈ ఏడాది UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఏడుగురు అభ్యర్థుల వివరాలు : ఇట్టబోయిన సాయి శివాని(Ittaboina Sai Shivani), పోతరాజు హరి ప్రసాద్, రాపర్తి ప్రీతి, బానోత్ నాగరాజ నాయక్, తొగరు సూర్యతేజ, గోకమల్ల ఆంజనేయులు, రామటెంకి సుధాకర్.

Next Story