- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: పేగు మార్పిడి ఆపరేషన్ ను విజయవంతం చేసినందుకు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revamnth Reddy) అభినందించారు. షార్ట్ గట్ సిండ్రోమ్ (Short Gut Syndrome) తో బాధపడుతున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో చివరగా ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) ని సంప్రదించాడు. ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందం (Doctors Team) ఆ వ్యక్తికి శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి ఆపరేషన్ (Intestine Transplant Operation) ను విజయవంతంగా నిర్వహించింది.
ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడు. అంతేగాక ద్రవ ఆహార పదార్ధాలను సులభంగా తీసుకోగలుగుతున్నాడు. దీంతో ఈ ఆపరేషన్ ఒక్క తెలంగాణలోనే గాక యావత్ భారతదేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలోని వైద్యరంగంలోనే మొట్టమొదటి విజయవంతమైన పేగు మార్పిడి ఆపరేషన్ గా నిలిచింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ చారిత్రాత్మక విజయం మన రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణమని అన్నారు. అలాగే వైద్య బృందాన్ని అభినందిస్తూ.. పబ్లిక్ హెల్త్ కేర్ రంగం (Public Health Care Dept) లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పారని కొనియాడారు. అంతేగాక అంకితభావం, నైపుణ్యంతో మానవాళికి విశిష్ట సేవందిస్తున్నందుకు వైద్య బృందాన్ని, సిబ్బందిని ప్రశంసించారు.






