CM Revanth Reddy: శభాష్.. ఉస్మానియా వైద్యులకు రేవంత్ రెడ్డి అభినందనలు

by Prasad Jukanti |   (  Updated:2025-04-18 05:50:43  IST  )

ఉస్మానియా డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

CM Revanth Reddy: శభాష్.. ఉస్మానియా వైద్యులకు రేవంత్ రెడ్డి అభినందనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’.. అన్న నానుడిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు (Osmania Hospital Doctors) తిరగరాశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేశారని అన్నారు. ఇటీవల షిర్డీకి వెళ్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన 22 ఏళ్ల యువకుడిని చేర్చుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించడంతో అతడి కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలించారు. అక్కడ వైద్యులు యువకుడిని అడ్మిట్ చేసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై సీఎం తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని అభినందించారు.

Next Story