మహ్మద్ సిరాజ్‌కు CM రేవంత్ అభినందనలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 16:22:09  IST  )

ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ ఇండియా

మహ్మద్ సిరాజ్‌కు CM రేవంత్ అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ ఇండియా సంచలన విజయం సాధించడం, రెండు ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న మహ్మద్ సిరాజ్‌(Mohammed Siraj)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలియజేశారు. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు మరుపురాని విజయం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో భారత జట్టు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని.. అందులోనూ సిరాజ్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కాగా, 374 పరుగుల లక్ష్యఛేదనలో 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లు తీశారు.

Next Story