‘ఆ నమ్మకం మీరు కలిగించారు’.. కలెక్టర్‌ను అభినందించిన CM రేవంత్

by Gantepaka Srikanth |

ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpathy)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందించారు.

‘ఆ నమ్మకం మీరు కలిగించారు’.. కలెక్టర్‌ను అభినందించిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpathy)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు’ అని ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. కాగా, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. ఈఎన్టీ సర్జన్ల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీ జరిగింది. ట్వీట్

Next Story