- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pope Francis Dies : పోప్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ప్రపంచ క్రైస్తవులకు మార్గదర్శి, రోమన్ కాథలిక్ చర్చి పరమ గురువైన పోప్ ఫ్రాన్సిస్ మరణం(Pope Francis Dies) పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ క్రైస్తవులకు మార్గదర్శి, రోమన్ కాథలిక్ చర్చి పరమ గురువైన పోప్ ఫ్రాన్సిస్ మరణం(Pope Francis Dies) పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోప్ అనుయాయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రేమ, కరుణ మార్గాలను బోధిస్తూ, పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపన, అంతర్ధార్మిక సామరస్యం కోసం పోప్ ఫ్రాన్సిస్ చేసిన కృషి అసాధారణమని, స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు.
అర్జెంటీనాలో సామాన్య కుటుంబంలో జన్మించి, పోప్ స్థాయికి ఎదిగిన ఆయన, తన నిరాడంబర జీవనశైలితో, ప్రజలకు చేరువై, వాటికన్ సిటీని, పోప్ స్థానాన్ని సామాన్యులకు మరింత సన్నిహితం చేసిన మహోన్నత గురువర్యులుగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ బోధనలు మరియు సేవలు రాబోయే తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో క్రైస్తవ సమాజానికి అండగా నిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి, ఆయన భక్తులకు మనోధైర్యం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.






