తెలంగాణ గొప్ప మేధావిని కోల్పోయింది: CM రేవంత్ సంతాపం

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-23 04:50:09  IST  )

ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. మధుసూదన్ రెడ్డి(Madhusudhan Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ గొప్ప మేధావిని కోల్పోయింది: CM రేవంత్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. మధుసూదన్ రెడ్డి(Madhusudhan Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్‌గా, ఐఐపీఏ డైరెక్టర్‌గా అనేక పదవులు నిర్వహించిన మధుసూదన్ రెడ్డి విద్యా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వారందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులతో వ్యక్తిగత సంబంధాలు కలిగిన గొప్ప మానవతావాది అని గుర్తుచేసుకున్నారు. వారి మరణంతో తెలంగాణ ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. మధుసూదన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పెట్టారు.

Next Story