- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాసేవలో లక్ష్మారెడ్డిది సుదీర్ఘ ప్రస్థానం: CM రేవంత్ సంతాపం
సీనియర్ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(Konda Laxma Reddy) మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(Konda Laxma Reddy) మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం తెలిపారు. ప్రజాసేవలో వారిది సుదీర్ఘ ప్రస్థానమని స్మరించుకున్నారు. జర్నలిజంపై ఆసక్తితో NSS వార్తా సంస్థను స్థాపించిన లక్ష్మారెడ్డి.. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కూడా సేవలందించిన విషయాన్ని గుర్తుచేశారు. కొండా లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మారెడ్డి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.






