- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో ఆయన రారాజు: CM రేవంత్
ఇండస్ట్రీలో ఆయన రారాజు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.

దిశ, వెబ్డెస్క్: భారతీయ చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన నటుడు ధర్మేంద్ర మరణం(Actor Dharmendra Passes Away) చాలా బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒక సందేశంలో పేర్కొన్నారు. సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన విలక్షణ నటుడు ధర్మేంద్రని కోల్పోవడం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని అన్నారు. ధర్మేంద్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో ధర్మేంద్ర కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి అభిమానులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కాగా, ఇండస్ట్రీలో ఆరు దశాబ్దాలకు పైగా తన నటనతో ధర్మేంద్ర రాణించారు. వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో సోమవారం తుదిశ్వాస విడిచారు.
1935, డిసెంబరు 8న పంజాబ్లోని నస్రలీ గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర.. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా చిత్రంతో అరంగేట్రం చేశారు. కెరీర్ తొలినాళ్లలో సాఫ్ట్, రొమాంటిక్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1970వ దశకంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆంఖే, షికార్, మేరా గావ్ మేరా దేశ్, యాదోంకీ బారాత్, దోస్త్, షోలే, ధరమ్ వీర్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇక ధర్మేంద్ర మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ధర్మేంద్ర మృతి వార్త విని ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Read More... సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత






