- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పేరు ఇదే.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్ !
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్ల, కాలేశ్వరం ప్రాజెక్టులపై స్పందిస్తూ...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్ల, కాలేశ్వరం ప్రాజెక్టులపై స్పందిస్తూ... కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నీటి సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలని క్షుద్ర పూజలు చేసినట్లు కేసిఆర్ కుట్రలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అబద్దాల వల్లే 2023లో కేసీఆర్ అధికారం కోల్పోయారని గుర్తు చేశారు. 2024 లో డిపాజిట్ కోల్పోయారని... ఇప్పుడు ఆ పార్టీ జీరో కు చేరుకుందన్నారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకలేదని చురకలు అందించారు. కాలేశ్వరం ప్రాజెక్టు అసలు పేరు అంబేద్కర్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు. కానీ ఊరు అలాగే పేరు మార్చింది కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. తుమ్మిడి హట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు వెళ్లిందని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో లక్ష కోట్లకు ప్రాజెక్టు వ్యయం వెళ్లిందని పేర్కొన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు ఖర్చు లక్ష కోట్లు అయితే కరెంటు బిల్లు 7000 కోట్లు ఉందన్నారు. లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఈరోజు ఏపీ ప్రభుత్వం బనకచర్ల చేపట్టడానికి కూడా కేసీఆర్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.






