కేసీఆర్‌కు నా పేరు తీయడానికి కూడా ధైర్యం రాలేదు: సీఎం రేవంత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

మాజీ సీఎం కేసీఆర్‌కు సభ మొత్తంలో తన పేరు ఎత్తడానికి కూడా ధైర్యం రాలేదని సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.

కేసీఆర్‌కు నా పేరు తీయడానికి కూడా ధైర్యం రాలేదు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ సీఎం కేసీఆర్‌కు సభ మొత్తంలో తన పేరు ఎత్తడానికి కూడా ధైర్యం రాలేదని సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. దాన్ని బట్టి కాంగ్రెస్ కార్యకర్తల బలం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఇంట్లో నుండి కాలు కదపకుండా అన్ని వసతులు అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు. 16నెలలుగా కేసీఆర్ ఇంట్లో కూర్చుని జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ పిల్లలను అసెంబ్లీకి పంపిస్తున్నామని అంటున్నారని మరి పిల్లలను పంపిస్తే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ప్రశ్నించారు.

పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు ఉండాలని అన్నారు. మీరెవరు? స‌భ‌కు రాకుండా మమ్మ‌ల్ని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు మీకు ఉందా అని నిల‌దీశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌ను మొద‌టి 10 సంవ‌త్స‌రాలు కోతుల గుంపుకు అప్ప‌జెప్పిన‌ట్టు అయింద‌ని మండిప‌డ్డారు. తాను చెడ్డ కోతి వనమంతా చెడించె అన్న‌ట్టు కేసీఆర్ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోచుకున్న మాట వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. మాట ఇస్తే వంద‌శాతం చేసి తీర‌తాన‌ని, ఈ మాట నెర‌వేర్చ‌లేద‌ని శ‌తృవులు కూడా త‌న‌మీద ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

Next Story