- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం కొనేవాళ్లలో తెలుగు మహిళలదే తొలి స్థానం: సీఎం రేవంత్ రెడ్డి
అత్యధికంగా బంగారం కొనేవాళ్లలో తెలుగు మహిళలదే తొలి స్థానం అని వెల్లడించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth

దిశ, వెబ్ డెస్క్: అత్యధికంగా బంగారం కొనేవాళ్లలో తెలుగు మహిళలదే తొలి స్థానం అని వెల్లడించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్ లో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ (Malabar Gems And Jewellery) తయారీ యూనిట్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఓ వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా మహేశ్వరం ప్రాంతంలో నాలుగో నగరాన్ని నిర్మించే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. గతంలో కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను నిర్మించారని వెల్లడించారు.
చంద్రబాబు, వైఎస్ఆర్ సైబరాబాద్ ను నిర్మించారన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో నగరాన్ని నిర్మించి, భారత్ కు ఫ్యూచర్ సిటీని అందించనుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి కోసం.. తమ ప్రభుత్వం ఎంతకైనా ముందుకు వెళ్తుందని వివరించారు. అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చరిత్రలో గుర్తిండి పోయాలా ముందుకు వెళ్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..






