- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: రేపు వరంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు.

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, ఔటర్ రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు తదితర అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరంగల్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలంటూ సీఎం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేశారు. మొదట పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం శాయంపేటలోని కాకతీయ మెగా జౌళి టెక్స్‌టైల్ పార్క్‌ను ఆయన సందర్శిస్తారు. అనంతర హన్మకొండలోని ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం నయీమ్‌నగర్‌లోని నాలా పనులను పరిశీలించాక కలెక్టరేట్‌లో నిర్వహించే రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేశారు.






