CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నాయకత్వాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ప్రత్యేకంగా (Appreciate's)అభినందించింది.

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నాయకత్వాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ప్రత్యేకంగా (Appreciate's)అభినందించింది. రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని సుసంపన్నత, నగర రవాణా సౌకర్యాలు, న్యాయపూర్వక ఆర్థిక వృద్ధి వంటి అత్యవసరమైన గ్లోబల్ అంశాలపై ఆయన చూపిన దృష్టి, లోతైన అవగాహన, విశ్వవ్యాప్త లక్ష్యాలపై స్పష్టమైన ఆలోచనలతో ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని డబ్ల్యుఈఎఫ్( World Economic Forum)తన అధికారిక లేఖ పత్రంలో ప్రశంసించింది. రేవంత్ రెడ్డి సుదూరదృష్టిని, సమర్థమైన ఆలోచన విధానాన్ని, సమాజ హితం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా కొనియాడింది.

ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అభివృద్ధికి అమలు చేస్తున్న ప్రణాళికలు, నగర రవాణా వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే ప్రణాళికలు బాగున్నాయని పేర్కొంది. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించి, వృద్ధిని న్యాయబద్ధంగా ప్రజలందరికీ చేరువ చేయడం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై ఆయన అవలంబిస్తున్న స్పష్టమైన విధానాలను డబ్ల్యుఈఎఫ్ తన లేఖలో ప్రస్తావిస్తూ ప్రశంసించింది. రాబోయే పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా మారుతుందన్న రేవంత్ మాటలు డబ్ల్యుఈఎఫ్ సదస్సుకు హాజరైన పెట్టుబడుదారులకు స్ఫూర్తినిచ్చాయని పేర్కోంది.

ఆధునిక సాంకేతికత, ప్రతిభ, స్వచ్ఛమైన ఇంధనం, స్థిరమైన, సమానమైన వృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలపడానికి ఉద్దేశించిన రైజింగ్ తెలంగాణ 2050 యొక్క మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి రాబోయే కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాల గురించి భారతదేశంపై కంట్రీ స్ట్రాటజీ డైలాగ్‌లో తెలుసుకోవడానికి ప్రపంచ పెట్టుబడిదారులు ఆసక్తి చూపారని తెలిపారు. 2047 నాటికి దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని తొలి కర్భన రహితంగా మార్చాలన్న మీ ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్ , అలాగే ఏఐ హబ్ గా, భవిష్యత్ టెక్నాలజీకి కేంద్రంగా అభివృద్ధి చేయాలనే మీ ప్రణాళికలు సదస్సులోని బిల్డింగ్ రీజెనరేటివ్, సర్క్యులర్ ప్లేసెస్ సెషన్‌లో పాల్గొన్న పెట్టుబడిదారులను బలంగా ఆకట్టుకున్నాయని ప్రశంసించింది.

రేవంత్ రెడ్డి ఆశయ సాధనకు, భవిష్యత్తు ప్రణాళికల అమలుకు మీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నామని డబ్ల్యుఈఎఫ్ పేర్కొంది. కాగా తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి, ప్రణాళికలకు, నూతన ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమ విధానాలు, అభివృద్ధి పథకాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

Next Story