- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హస్తిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హస్తిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. గురువారం పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తోభేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, దీపాదాస్మున్షీతో కలిసి గంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, మంత్రిర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, స్థానిక ఎన్నికలపై సమాలోచనలు చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు జరిగాయని, వాటిని ప్రజల్లోకి ఎంత మేరకు తీసుకెళ్లారనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. త్వరలో రెండు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. శుక్రవారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను కలవనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.






