CM Revanth Reddy: విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2025-01-23 05:16:44.0  )
CM Revanth Reddy: విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటన నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2.35కు ఆయన జ్యూరిచ్ నుంచి దుబాయ్‌ (Dubai)కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా శుక్రవారం ఉదయం 8.25కు హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణ‌ (Telangana)ను ఇండస్ట్రిల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సు వేదికగా రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) బృందం పలు విదేశీ కంపెనీ ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ పెవిలియన్‌ (Telangana Pavilion) లో సీఎం రేవంత్, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ‌ (Wipro Executive Chairman Rishad Premji)తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో భాగంగా హైదారబాద్‌ (Hyderabad)లోని గోపన్‌పల్లి (Gopanpally)లో కొత్త విప్రో ఐటీ సెంటర్‌ (Wipro Center)ను ఏర్పాటు చేయబోతున్నామని రిషద్ ప్రేమ్‌జీ (Rishad Premji) వెల్లడించారు. అందుకు సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కొత్త విప్రో ఐటీ సెంటర్ (Wipro IT Center) ఏర్పాటుతో దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అభించే అవకాశం ఉంది. మరో రెండు, మూడేళ్లలో ఐటీ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి.



Next Story

Most Viewed