CM Revanth Reddy: బీఆర్ఎస్, కిషన్ రెడ్డికి కొత్త పేర్లు.. నిండు సభలో రేవంత్ రెడ్డి నామకరణం

by Prasad Jukanti |   (  Updated:2026-02-08 13:15:59  IST  )

బీఆర్ఎస్, బీజేపీపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్, కిషన్ రెడ్డికి కొత్త పేర్లు.. నిండు సభలో రేవంత్ రెడ్డి నామకరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ (KCR), మోడీని (Modi) చూసి ఓట్లు వేస్తే మోసపోతాం, గోసపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. గల్లీలో మోరి తీయాలంటే కేసీఆర్ వస్తారా? నిధులు కావాలంటే మోడీ ఢిల్లీ నుండి వస్తారా అని ప్రశ్నించారు. ఇవాళ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్, మోడీ ఈ ఇద్దరూ బొమ్మలు చూసి ఓట్లు అడగడానికే పనికి వస్తారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో మున్సిపాలిటీలకు తమ ప్రభుత్వం రూ.17,442 వేల కోట్లు ఇచ్చిందని 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని ఆదిలాబాద్‍లోని బాసర నుంచి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు మూడు, 4 వేల కోట్లయినా ఖర్చుకు వెనకాడకుండా అభివృద్ధి చేస్తామన్నారు.రాబోయే రోజుల్లో ఈ పరివాహక ప్రాంతానికి మహర్దశ పట్టబోతోందన్నారు.

ఇకపై బీఆర్ఎస్ కాదు:

టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్న దుర్మార్గులు బీఆర్ఎస్ పాలకులు అని సీఎం దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా మా భూములు కొనుగోలు చేసిన వారిని బ్లాక్ మెయిల్ చేసి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు వసూలు చేశారని బీఆర్ఎస్ అకౌంట్లో ఉన్న 15 వందల కోట్ల రూపాయలు ఎవరి అబ్బ సొమ్ము అని ప్రశ్నించారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన బీఆర్ఎస్‍ను 'బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి' గా (Blackmail Rastra Samithi) నామకరణం చేస్తున్నానన్నారు. చేసిన పాపాలు ఊరికే పోవని ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు వేరు వేరు కాదని అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దెబ్బకు దెబ్బ, ఎత్తుకు పై ఎత్తు వేద్దామని బీజేపీ, బీఆర్ఎస్, కేసీఆర్, మోడీ, అమిత్ షానే కాదు మీ తాతలు ముత్తాతలు తీసుకొచ్చినా మా కాంగ్రెస్ కార్యకర్తలు వారి సంగతి తేలుస్తారన్నారు.

కిషన్ రెడ్డికి కొత్త పేరు:

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరిని అరెస్టు చేయమంటే ఈ రాష్ట్రానికి నేనేమైనా ముఖ్యమంత్రినా అని కిషన్ రెడ్డి మాట్లాడుతూన్నారు.. మరి తెలంగాణను ఇచ్చిన ఆడబిడ్డ సోనియా గాంధీని, ఈ దేశంకోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్న ఈడీ, సీబీఐ మీది, మీ మోడీది కాదా? అని సీఎం ప్రశ్నించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి, ఫార్ములా కేసును ఈడీకి పంపి చాలా నెలలవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‍రావును కనీసం విచారణకు పిలవడం లేదని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరును 'కల్వకుంట్ల కిషన్ రావు'గా (Kalvakuntla Kishan Rao) పిలుస్తానన్నారు. కేసీఆర్‍కు కేటీఆర్ దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడని విమర్శించారు. నన్ను ఈరాష్ట్రంలోని అన్ని వర్గాల వారు సొంతం చేసుకుంటుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నన్ను రేవంతుద్దీన్ అంటున్నారు. అలా అన్న పర్వాలేదు కానీ నీ పక్కనున్న కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారు ముందు ఆ విషయం చూసుకోండన్నారు.

Next Story