- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revanth Reddy: అంతకంటే సూసైడ్ చేసుకుని చావడం మేలు.. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ విషయాలు విన్నారని అంటున్నారు.. అలా వినాల్సిన అవసరం ఏంటి..? ఆ పరిస్థితే వస్తే సూసైడ్ చేసుకుని చావడం మేలు అని హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశం అనంతరం ఆయన చిట్‌చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం కేసు పెట్టలేదని, సామగ్రి మిస్సింగ్ కేసును లోతుగా విచారణ చేస్తే ఇవన్నీ బయటపట్టాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను తాను డిక్టేట్ చేయనని, నిజానికి ఫోన్ ట్యాపింగ్‌పై తొలుత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తొలుత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం కాదని, దానికంటూ ఓ పద్దతి ఉంటుందన్నారు. నా ఫోన్ ట్యాప్ అయిందని అనుకోవడం లేదని.. దానిపై ఇంతవరకు నోటీసులు రాలేదన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు.






