- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth Reddy: ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పలేదు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడంలో కేంద్రం సహకరించలేదని ఆరోపించారు

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రభాకర్‌రావు కీలక వ్యక్తి అని ఆయనను 20 నెలలు అమెరికాలో దాచిపెట్టడం వల్లే ఈ కేసులో అరెస్టులు జరగలేదన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం.. ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్‍కు తీసుకురావడానికి కేంద్రం సహకరించలేదన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్‌తో ఇండియాకి రప్పించామన్నారు. అరెస్టుల కోసం బావ బావమరిది పోటీ పడుతున్నారని జైలుకు వెళ్లొస్తే మేమూ సీఎం అవుతామని హరీష్ రావు, కవిత (Kavitha) అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నంత సేపు కేసీఆర్ ఫ్యామిలీ కలిసి ఉంటుంది. అధికారం కోల్పోయాక విడిపోయారన్నారు. అందరు కలిసి ఉన్నప్పుడే వాళ్లని బొందపెట్టి సీఎం కూర్చీలోకి వచ్చానని కవిత ఇష్యూతో నాకు సంబంధం లేదన్నారు.
2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు:
నియోజకవర్గాల పునర్‌విభజన తర్వాతే జమిలీ ఎన్నికలు ఉంటాయన్న సీఎం.. 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. మహిళల రిజర్వేషన్ కూడా ఉంటుందని జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌తో మనకే నష్టమేనన్నారు. ప్రస్తుతానికి జిల్లాల కుదింపు, కొత్త జిల్లాలు ఇచ్చే ఆలోచన లేదని ముందు జనగణన ఆ తర్వాత పునర్విభజన ఉంటుందన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం పక్క రాష్ట్రం అంశం అన్న రేవంత్ రెడ్డి.. మన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యి వాడుతున్నామని చెప్పారు. అజారుద్దీన్‍కు ఎమ్మెల్సీ ఎందుకు ఆమోదించలేదో గవర్నర్ చెప్పాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‍కు ఎవరు సహరించకపోయినా మేమే చేస్తామన్నారు.
ఆయనకు మంత్రి ఇస్తానని చెప్పలేదు:
నేను ఏ ఎన్నికనైనా సీరియస్‍గానే తీసుకుంటానని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేను చెప్పడం కాదు, మీరే చూస్తారన్నారు. కిషన్ రెడ్డిని పట్టుకుని ఇదే కేసీఆర్ రండ అన్నారని ఎవరు చేసుకున్నది వాళ్లకే తిరిగి వస్తుందన్నారు. మనిషి వికృతంగా మారినప్పుడు ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుందన్నారు. రంజిత్ రెడ్డిని మంత్రిని చేస్తా అని నేను చెప్పలేదని నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. మున్సిపల్ మంత్రిగా నిధులు ఇచ్చి అభివృద్ధి బాధ్యత రంజిత్ రెడ్డికి ఇస్తాను అని చెప్పానని స్పష్టత ఇచ్చారు.






