- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మీయ మిత్రుల కలయిక! రేవంత్ రెడ్డి, దేవినేని ఉమా, పయ్యావుల కేశవ్ ముచ్చట్లు
హైదరాబాద్ నానక్‌రామ్ గూడ లోని ప్రధాన్ కన్వెన్షన్ లో జరిగిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నానక్‌రామ్ గూడ లోని ప్రధాన్ కన్వెన్షన్‌లో జరిగిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఏపీ టీడీపీ మంత్రులు, నేతలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redd) కలిశారు. నూతన వధూవరులు మానస, సిద్ధార్థలకు అక్షింతలు వేసి వారు ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, దేవినేని ఉమా (Devineni Uma), పయ్యావుల కేశవ్.. వేం నరేందర్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర ముచ్చట్లు పెట్టారు. ఒకరినొకరు పలకరించుకోని నవ్వుతూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘రేవంత్ రెడ్డి, దేవినేని ఉమా, పయ్యావుల కేశవ్ (Payyavula Keshav)’ ఈ స్నేహబంధం రాజకీయ చరిత్రకు పాఠంగా మిగిలిపోయేదని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. రాజకీయ చిరకాల మిత్రుల ఆత్మీయ కలయిక అని కాంగ్రెస్ శ్రేణులు వీడియోను పోస్ట్ చేశారు.






