- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓడిపోతే అక్కడే ముక్కు నేలకు రాస్తా.. CM రేవంత్ సంచలన సవాల్
బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR)కు, బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR)కు, బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరారు. శుక్రవారం నారాయణపేట్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పదేళ్లు అధికారంలోకి ఉండి కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో.. పన్నెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ, ఏడాదిలోనే తామేం చేశామో చర్చించడానికి తాను సిద్ధమని కీలక ప్రకటన చేశారు. చర్చలో తాను ఓడిపోతే అక్కడే ముక్కు నేలకు రాస్తా అన్నారు. ఏడాదిలో తాము చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రం చేయలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. పదేళ్లలో ఏ ఒక్కరికైనా కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు వలసలు ఆపేందుకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. మళ్లీ ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
‘తాను బీజేపీ, బీఆర్ఎస్‌కు సూటిగా సవాల్ విసురుతున్నా.. పన్నెండేళ్ల మోడీ పాలనపై, పదేళ్ల బీఆరెస్ పాలనపై, పన్నెండు నెలల మా పాలనపై చర్చకు మేం సిద్ధం.. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్(Bandi Sanjay) ఎవరొస్తారో రండి.. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారో కొడుకును, అల్లుడిని పంపిస్తారో రండి.. ప్లేస్, డేట్ చెప్పండి చర్చకు నేను సిద్ధం’ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏ ఊర్లో తాము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో ఆ ఊర్లో మేం పోటీ చేస్తాం.. ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో అక్కడే మీరు పోటీచేయాలని సూచించారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని బయలుదేరి మనపై కుట్రలు చేస్తున్నారు.. అలాంటి వారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలి.. పనులు చేసే బాధ్యత నాది.. నన్ను కాపాడుకునే బాధ్యత మీది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.






