CM Revanth Reddy: తెలంగాణ ప్రజాపాలనకు బౌద్ధ ఆదర్శాలే మార్గదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

తెలంగాణ ప్రజా పాలనకు బౌద్ధ ఆదర్శాలే మార్గదర్శనం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ ప్రజాపాలనకు బౌద్ధ ఆదర్శాలే మార్గదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజా పాలనకు బౌద్ధ ఆదర్శాలే మార్గదర్శనం అని బుద్ధుని ఆశయాలకు అనుగుణంగా నేడు రాష్ట్ర పాలన సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. 'బుద్ధ పూర్ణిమ' (Buddha Purnima) సందర్భంగా సోమవారం సీఎం రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బుద్ధ భగవానుని బోధనలు, అనుసరించిన అహింస, ప్రేమ, కరుణ మార్గాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బుద్ధని బోధనలు, కార్యచరణను స్మరించుకుని వాటి ప్రాముఖ్యతను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నర్సుల సేవలు అద్వితీయం:

‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ (international nurses day) సందర్భంగా నర్సులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అచంచలమైన నిబద్ధతతో ప్రజారోగ్య సంరక్షణలో అసమాన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రతిఫలం ఆశించకుండా అవిశ్రాంతంగా నర్సులు అందించే సేవలు అద్వితీయమని ప్రశంసించారు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆధ్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ కు ఈ సందర్భంగా సీఎం నివాళి అర్పించారు.

Next Story