- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రజలకు భోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
తెలంగాణలో ఆషాడమాస బోనాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు భోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆషాడమాస బోనాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు భోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. గోల్కొండ జగదాంబకి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని సీఎం ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించేలా తల్లి దీవెనలు ఉండాలన్నారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సదుపాయం కోసం రూ.20 కోట్లు విడుదల చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.






