- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పెట్టుబడుల వేట షురూ
రైజింగ్ తెలంగాణ(Telangana Rising) దిశగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల(Foreign Investments) సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి(M Revanth Reddy) చేపట్టిన విదేశీ పర్యటన(Foreign Trip)లో భాగంగా సింగపూర్ పర్యటనను ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్ : రైజింగ్ తెలంగాణ(Telangana Rising) దిశగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల(Foreign Investments) సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేపట్టిన విదేశీ పర్యటన(Foreign Trip)లో భాగంగా సింగపూర్ పర్యటనను ప్రారంభించారు. సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి(Government of Singapore) వివియన్ బాలకృష్ణన్(Dr Vivian Balakrishnan)తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అద్భుతమైన అంతర్ దృష్టి కలిగిన ఇండోఫైల్‌తో చాలా ఆకర్షణీయమైన, ఫలవంతమైన.. విస్తృత చర్చలతో సింగపూర్‌లో మా రెండు దేశాల పర్యటనను ప్రారంభించినట్లుగా రేవంత్ బృందం ట్వీట్ చేసింది.
మౌలిక సదుపాయాల నిర్మాణం, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య మరియు నైపుణ్యాల నిర్మాణం, ఐటీ పార్కులు మొదలైన రంగాల్లో సుస్థిరమైన విస్తృత, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరుచనున్నట్లుగా తెలిపారు. సింగపూర్ పర్యటనలో అనేక ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలతో పెట్టుబడుల సాధనలో గొప్ప విజయం కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం పర్యటనకు సంబంధించిన మరిన్ని ప్రగతిదాయక వివరాలను త్వరలో షేర్ చేస్తామని..టీమ్ తెలంగాణ రైజింగ్ తమ తదుపరి సమావేశానికి సన్నద్ధమవుతోందని వెల్లడించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా సింగపూర్ లో 17,18,19తేదీల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు.
సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ (ITE)ని సందర్శిస్తారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించే విషయమై సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. తదుపరి 20నుంచి 22వరకు దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్) వార్షిక సదస్సుకు హాజరవుతారు.






