- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: నేనే తప్పుచేయలేదు.. నాంపల్లి కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండో సారి కోర్టుకు హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ తనపై పోలీసులు చేసిన ఆరోపణలు అవాస్తవాలని, నేనేం తప్పు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోర్టుకు తెలిపారు. గత అెసంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని గతంలో నమోదైన కేసులో ఇవాళ రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు(Nampally Court) హాజరయ్యారు. ఎన్నికల కోడ్ బ్రేక్ చేశారని మెదక్, బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్ లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలని చెప్పారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఈ తప్పుడు కేసులు పనమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు జూన్ 12న తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరుకావడం రేవంత్ రెడ్డికి ఇది రెండోసారి.






