CM Revanth Reddy: నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-02-20 11:41:44  IST  )

సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

CM Revanth Reddy: నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు (Nampally Special Court) హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై గతంలో నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో కేసులు నమోదు అయ్యాయి. అలాగే బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ గత ఎన్నికల్లో వీడియో రిలీజ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఇలా తనపై నమోదైన మొత్తం 9 కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. సీఎం వస్తుండటంతో కోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని తెలిపారు.

Next Story