- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(Hyderabad)లో జరిగిన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో(American Independence Day celebrations) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో జరిగిన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో(American Independence Day celebrations) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్‌లో జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ(249వ వార్షికోత్సవం) వేడుకలను నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం, అమెరికా మధ్య దౌత్య సంబంధాలు 1947లో ప్రారంభమై.. నేటి వరకు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, విద్య, సాంకేతిక రంగాల్లో మరింత ధృఢంగా మారాయని అన్నారు. ఈ వేడుకలో భారత్-అమెరికా స్నేహ సంబంధాలను గుర్తు చేస్తూ, రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు ఇరు దేశాల అధికారులు, వ్యాపారవేత్తలు, అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు.






