- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కొద్దిసేపట్లో సీడబ్ల్యూసీ కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో జనవరి 1 తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతుంటడం ప్రాధాన్యత సంతరించుకుంది.






